తెలుగు ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని, సమాజాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని గురువులే ప్రసాదిస్తారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జగద్గురువుల్లో ప్రథముడైన వ్యాస భగవానుని జన్మతిథినాడు... గురుపూర్ణిమ పేరిట పూజించుకోవడం మన సంప్రదాయన్నారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు జ్ఞానభిక్షతో పునర్జన్మనిచ్చి... జీవితానికి సార్ధకతని కలిగిస్తారని లోకేశ్ స్పష్టం చేశారు. అందుకే గురుస్థానం అత్యంత విలువైందని అన్నారు. ప్రతి వ్యక్తి సమున్నత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు.... సమసమాజ స్థాపనకు నిరంతరం శ్రమిస్తున్న గురువులందరికీ లోకేశ్ గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: