ETV Bharat / city

చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన టీడీఎల్పీ సమావేశం - ap assembly meetings latest news

చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ ద్వారా సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

TDLP online meeting
ఆన్‌లైన్‌లో ఉదయం 10.30 గంటలకు టీడీఎల్పీ సమావేశం
author img

By

Published : Jun 15, 2020, 10:20 AM IST

Updated : Jun 15, 2020, 10:58 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ఆన్ లైన్​లో ప్రారంభమైంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.... అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నారు. తెదేపా నేతల వరుస అరెస్టులకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబుకి సూచించారు. దీనిపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఎటువంటి అంశాలు లేవనెత్తాలనే దానిపైనా సమాలోచనలు చేయనున్నారు. ప్రభుత్వ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం యోచిస్తోంది. నేతల అక్రమ అరెస్ట్‌లతో పాటు ఇసుక, మద్యం, మైన్స్‌, భూముల్లో వైకాపా నేతల కుంభకోణాలకు పాల్పడ్డారన్నది తెదేపా ఆరోపణ. వీటిని సభలో లేవనెత్తి అంశాల వారీగా చర్చకు పట్టుబట్టాలని.... అవకాశం రాకుంటే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలోనూ, బడ్జెట్‌ ప్రసంగ సమయంలోనూ ఈ అంశాలను గట్టిగా లేవనెత్తాలన్నది తెదేపా ఆలోచనగా తెలుస్తోంది.

ఇవీ చూడండి-విశాఖ గ్యాస్ లీకేజీ : పరిహారం కోసం పడిగాపులు

Last Updated : Jun 15, 2020, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.