రాష్ట్రంలో పరిశ్రమ నెలకొల్పేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నామనీ... వీలైనంత త్వరగా పరిష్కరించాలని చైనా సంస్థ టీసీఎల్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని కోరారు. సచివాలయంలో మంత్రితో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూమి, నీరు, విద్యుత్తు, రవాణా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తే... తమ సంస్థ దశల వారీగా చేపట్టబోయే కంపెనీ పనుల గురించి గౌతమ్‌రెడ్డికి వివరించారు. ఉద్యోగ కల్పన సహా... ఇతర అంశాలపై సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని గౌతమ్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..