అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ మహాసభలు వచ్చే ఏడాది జులై 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. స్థానిక పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో వీటిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, మహాసభల సమన్వయకర్త రవి తదితరులు శనివారం కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించి.. ప్రతినిధులు రస్సెల్ కైస్, ఆంథోని నెల్సన్‌తో మాట్లాడారు. తానా నాయకత్వం, స్థానిక తెలుగు ప్రజలు, దాతల సహకారంతో ప్రణాళికా బద్ధంగా సభలు నిర్వహించనున్నట్లు అంజయ్య చౌదరి వివరించారు. కార్యక్రమంలో తానా మిడ్ అట్లాంటిక్ రీజినల్ కో ఆర్డినేటర్ సునీల్ కోగంటి, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, లక్ష్మి దేవినేని, జనార్దన్ నిమ్మలపూడి, తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి, ఫౌండేషన్ ట్రస్టీలు విద్యాధర్ గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: