ETV Bharat / city

Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారు చెప్పినట్టుగా జరుగుతోందా.. ఇదిగో సాక్ష్యం! - Tamarind kallu

తాటి, ఈత, ఖర్జూర చెట్లను చూడని వారు ఉండరు. వీటి నుంచి వచ్చే కల్లును చాలా మంది తాగడం.. మనం సహజంగా చూస్తూనే ఉంటాం. వేప కల్లును ఔషధంగా వినియోగిస్తారని కూడా మనకు తెలుసు. కానీ వీటన్నింటికి భిన్నంగా చింత చెట్టుకు కల్లు రావడం ఎప్పుడైనా మీరు చూశారా?..పోనీ.. విన్నారా? లేదు కదా?. కానీ చింత చెట్టుకు కల్లు వస్తుందోయ్​. ఇది నిజం. కావాలంటే మీరే చూడండి.

బ్రహ్మంగారు కాలజ్ఞానం
బ్రహ్మంగారు కాలజ్ఞానం
author img

By

Published : Nov 1, 2021, 7:15 PM IST

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ నిజమవుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామ ప్రజలు. ఎందుకంటే తాటి, ఈత, వేప చెట్లకు కల్లు రావడం మన అందరికీ తెలిసిన విషయమే.. కానీ వీటన్నింటికి భిన్నంగా ఆ గ్రామంలోని ఓ చింత చెట్టుకు కల్లు వస్తుంది. ఆవుదొడ్డి వెంకన్న అనే వ్యక్తి ఇంటి ఆవరణలో రెండు చింత చెట్లు ఉన్నాయి. ఇవి ఒక్కోటి విద్యుత్ స్తంభం ఎత్తులో ఉన్నాయి. వీటిలో ఒక చెట్టుకు గత వారం రోజుల నుంచి దాని మధ్య భాగంలో ద్రవం వెలువడుతోంది. అయితే ఇది గమనించిన దొడ్డి వెంకన్న..తన ఇంటి పక్కన ఉంటున్న కల్లుగీత కార్మికుడు గుండగాని సత్తయ్యకు చెప్పాడు.

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ నిజమవుతున్నాయా..!

అతను ఆ చెట్టును పరిశీలించి.. ద్రవం వచ్చే భాగంలో ఈతచెట్టును తొలిచినట్లుగా కత్తితో తొలిచాడు. దానికి ఖాళీ ప్లాస్టిక్ సీసాను ఏర్పాటు చేశాడు. రోజూ మెర వేస్తుండటంతో గత మూడు రోజుల నుంచి కల్లు వస్తోందని సత్తయ్య తెలిపారు. గత మూడు రోజుల నుంచి అర సీసా చొప్పున కల్లు వచ్చినట్లు స్థానికులు సైతం చెబుతున్నారు. దీనిని పలువురు తాగి రుచి చూశారు. పులుపు, వగరుతో కూడి ఉందని చెప్పారు. ఎక్కడా లేని విధంగా చింత చెట్టు నుంచి కల్లు వస్తుందన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు చెట్టు దగ్గరికి వచ్చి వింతగా చూసి వెళుతున్నారు. చింత చెట్టు నుంచి కల్లు రావడం అపశకునం భావించి చెట్టును తొలగించమని పలువురు సూచిస్తున్నారట.

నేను తాటి, ఈత, ఖర్జూర చెట్ల నుంచి కల్లు గీశాను. అయితే మా ఇంటి పక్కన రెండు చింత చెట్లు ఉన్నాయి. వాటిలో ఒకదానికి కల్లు లాగా నీరు కారడంతో వెంకన్న నాకు చెప్పాడు. నేను ఈతచెట్టును తొలిచినట్లుగా కత్తితో తొలిచి చిన్న ఖాళీసీసా తగిలించాను. మూడు రోజుల నుంచి తాటి, ఈత చెట్ల నుండి వచ్చేవిధంగా కల్లు వస్తుంది. ఇది కొంచెం పులుపు, వగరుతో కూడి ఉంది.- గుండగాని సత్తయ్య, కల్లుగీత కార్మికుడు

ఇదీ చదవండి:

TS Minister KTR France Tour : రామారావు గారూ... బాగున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.