ETV Bharat / city

MLA Etela land survey: ఈటల భూములపై నేటినుంచి సర్వే.. ఏం తేలుస్తారు? - etela land survey

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్(Farmer minister Etela rajender) భూముల సర్వే ఈరోజు నుంచి జరగనుంది. మెదక్ జిల్లాలోని భూముల సర్వే(land survey)కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. సర్వేకు రావాలంటూ ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డితో పాటు.... మరో 154మందికి ఈ నెల 8న నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా ఇవాళ అచ్చంపేట పరిధిలోని 130 సర్వే నెంబర్లోని భూములను సర్వే చేస్తారు.

survey-on-etela-lands-at-masaipeta-in-medak-district
ఎమ్మెల్యే ఈటల భూములపై నేటి నుంచి సర్వే
author img

By

Published : Nov 16, 2021, 9:49 AM IST

తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender) భూముల సర్వే(land survey) ఈరోజు నుంచి జరగనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మెదక్ జిల్లాలోని భూముల సర్వే(Etela land issues)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భూముల సర్వేకు రావాలంటూ ఈటల కుటుంబ సభ్యుల(notice to MLA Etela family)తో పాటు మరో 154మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈసర్వే నేటి నుంచి మూడు రోజుల పాటు సాగనుంది.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. తమ భూములను ఈటల ఆక్రమించాడని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలు రంగంలోకి దిగాయి. అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఈటల రాజేందర్(Etela rajender) హేచరీల(Jamuna Hatcheries)తో పాటు పక్క భూముల్లో సర్వే నిర్వహించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అధికారుల తీరుపై ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు హైకోర్టు(Telangana High court)ను ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సర్వే జరిగిందని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు, తగు సమయం ఇచ్చి.. సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో జూన్ మూడో వారంలో పునఃసర్వేకు అధికారులు సిద్ధం కాగా.. కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు.

కరోనా తగ్గుముఖం పట్టడంతో అధికారులు భూముల సర్వేకు సన్నద్ధం అయ్యారు. సర్వే(MLA Etela land survey)కు రావాలంటూ ఈటల రాజేందర్ సతీమణి జమున, కుమారుడు నితిన్ రెడ్డితో పాటు మరో 154మందికి ఈ నెల 8తేది నోటీసులు ఇచ్చారు. జమున హేచరీస్​కు చెందిన గోడలకు నోటీసులు అతికించారు. 16, 17, 18 తేదీల్లో భూముల సర్వే చేయనునున్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇందులో భాగంగా నేడు అచ్చంపేట గ్రామపరిధిలోని 130 సర్వే నెంబర్లోని భూములను.. 17వ తేది ఇదే గ్రామంలోని 77 నుంచి 82 సర్వే నెంబర్ల వరకు ఉన్న భూములను సర్వే(MLA Etela land survey) చేస్తారు. 18వ తేది హకీంపేట గ్రామం పరిధిలోని 97 సర్వే నెంబర్​లోని భూములను సర్వే చేయనున్నారు. తూప్రాన్ డివిజన్ ఉప సర్వేయర్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

TRS vs BJP: 'భాజపా ఎదురుతిరిగితే మూడే గంటల్లో తెరాస భూస్థాపితం ఐతది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.