ఎగువన మున్నేరు నుంచి వరద ప్రవాహాలు పెరగటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా పెద్ద మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. మున్నేరుకు 1 లక్షా 23 వేల 409 ఇన్ ఫ్లో వస్తుండటంతో అంతే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద నీరు 37 వేల 448 క్యూసెక్కులుగా నమోదైంది. అయితే ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశమున్నందున డ్యామ్‌ను ఖాళీ చేయించేలా.. అందుకు రెట్టింపు మొత్తంలో నీటిని దిగువకు విడుస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోని అన్ని గేట్లనూ ఎత్తి 86 వేల క్యూసెక్కులను నీటిని సముద్రంలోకి విడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 57 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది.
ఇదీ చదవండి