సీపీఐ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం ..తన స్నేహితుడైన జైపాల్‌రెడ్డి మృతి దేశానికి తీవ్రనష్టమని వ్యాఖ్యానించారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
జైపాల్‌రెడ్డి...నాకు విద్యార్థి జీవితం నుంచి పరిచయం. మేం మంచి స్నేహితులం... రాజకీయ ప్రత్యర్థులం. ఆయన తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ మేధావి. దేశ రాజకీయాల్లో నిబద్ధతతో వ్యవహరించారు. అవినీతికి ఆమడదూరంలో ఉన్న రాజకీయ నేత..జైపాల్. పార్లమెంటులో అనేక ప్రజా సమస్యలపై గళమెత్తారు. సోషలిస్టు భావాలను రాజకీయాల్లో చొప్పించారు. హాస్యాస్పద, సునిశిత విమర్శలు చేసేవారు.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా అనిల్ అంబానీని జైపాల్‌రెడ్డి ఎదుర్కొన్నారు. అనిల్ అంబానీతో ఘర్షణ సాధ్యమా? జైపాల్‌రెడ్డి చేయగలరా? అనే అనుమానాలుండేవి. శక్తివంతమైన మంత్రిగా జైపాల్‌రెడ్డి నిరూపించుకున్నారు. ఆ తర్వాత జైపాల్‌రెడ్డి తన పోర్ట్‌ఫోలియో కోల్పోవాల్సి వచ్చింది. అయినా జైపాల్‌రెడ్డి తన నిబద్ధతను వదులుకోలేదు. జైపాల్‌రెడ్డి మరణం... దేశానికి తీవ్రనష్టం.
-- సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ నేత
ఇవీ చదవండి... కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ప్రస్థానం...!