ETV Bharat / city

SUPREME COURT:ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా డిస్కంల తీరు - Supreme Court latest news

హిందుజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌తో ఉన్న వివాదంలో విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయాలని సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను బేఖాతర్‌ చేసిన ఏపీఎస్‌పీడీసీఎల్‌పై సుప్రీంకోర్టు మండిపడింది. ప్రభుత్వరంగ సంస్థలైన డిస్కంలు ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు పేర్కొంది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు
author img

By

Published : Feb 3, 2022, 8:56 AM IST

Updated : Feb 3, 2022, 9:15 AM IST

హిందుజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌తో ఉన్న వివాదంలో విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయాలని సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను బేఖాతర్‌ చేసిన ఏపీఎస్‌పీడీసీఎల్‌పై సుప్రీంకోర్టు మండిపడింది. ప్రభుత్వరంగ సంస్థలైన డిస్కంలు ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు పేర్కొంది. తాము ధిక్కరణ చర్యలు తీసుకొనే అవకాశమున్నా.. సంయమనం పాటిస్తున్నట్లు తెలిపింది. హిందుజా సంస్థతో ఉన్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఏపీఎస్‌పీడీసీఎల్‌ దాఖలుచేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.

‘2018 మార్చి 16న విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఏపీ డిస్కంలు హిందుజా నుంచి యూనిట్‌కు రూ.3.82 చొప్పున 2020 జులై వరకు విద్యుత్తు కొన్నాయి. 2020 ఆగస్టు 21న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం డిస్కంలు అదే ధరకు హిందుజా నుంచి విద్యుత్తు కొనాలి. కానీ, కొనలేదు. 2020 ఆగస్టు 21న జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేసినందున కొనలేదని చెప్పాయి. ఈ కారణంతో డిస్కంలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలుచేయకుండా తప్పించుకోలేరు. ఈ కోర్టు, ట్రైబ్యునల్‌ చెప్పినట్లు డిస్కంలు హిందుజా నుంచి రూ.3.82కి విద్యుత్తు కొనకపోగా, కేఎస్‌కే మహానది, మరికొన్ని సంస్థల నుంచి యూనిట్‌కు రూ.4.33కి కొనేంద]ుకు మొగ్గుచూపాయి.

ఈ విషయంలో డిస్కంల తీరను ఖండిస్తున్నాం. పిటిషన్‌ను రూ.5లక్షల కాస్ట్‌లతో కొట్టేస్తున్నాం. డిస్కంలు, హిందుజా సంస్థలు ఏపీ స్టేట్‌ విద్యుత్తు కమిషన్‌ ముందు దాఖలుచేసిన పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్తు కమిషన్‌ నిర్ణయం వెలువరించేవరకూ డిస్కంలు ఇప్పటినుంచి హిందుజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌ నుంచి యూనిట్‌కు రూ.3.82కి కొనాల్సిందే’ అని తీర్పులో పేర్కొన్నారు. ఈ రెండు కేసులూ రాష్ట్ర విద్యుత్తు కమిషన్‌ ముందు పెండింగ్‌లో ఉన్నందున ఆరునెలల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: Chalo Vijayawada: 'చలో విజయవాడ'పై ఉక్కుపాదం... ఉద్యోగ, ఉపాధ్యాయుల గృహనిర్బంధం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Feb 3, 2022, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.