ETV Bharat / city

ఎన్నికల కోడ్ రద్దు.. వాయిదా కొనసాగింపు.. కొత్త పథకాలు వద్దు.. - స్థానిక ఎన్నికల వాయిదా కొనసాగింపు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ధర్మాసనం రద్దుచేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని పేర్కొంది. అభివృద్ధి పథకాలను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. పిటిషన్​పై విచారణ ముగించింది.

supreme-court-verdict-on-local-body-elections-is-andhrapradesh
స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు
author img

By

Published : Mar 18, 2020, 12:33 PM IST

Updated : Mar 18, 2020, 5:09 PM IST

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుదినిర్ణయమని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక కోడ్‌ ఎత్తివేయాలని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది.

కొత్త పథకాలు తీసుకురావొద్దు

ఇప్పటికే అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను కొనసాగించేందుకు అనుమతిచ్చిన ధర్మాసనం..కొత్త పథకాలు, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆరువారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనావేసి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని స్పష్టం చేసింది. విధానపరమైన నిర్ణయాలను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా తీసుకోవద్దని.. కొత్తగా ఉచిత పథకాలను తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్నికల ఎప్పుడు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు.. ఎన్నికల తేదీలు ఖరారు చేసినప్పటి నుంచి మళ్లీ కోడ్ అమల్లోకి తీసుకోవాలని చెప్పింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగింపు పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానికే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇంతటితో ఈ పిటిషన్ పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

ఇవీ చదవండి.. ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేశారు'

Last Updated : Mar 18, 2020, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.