ETV Bharat / city

Telangana: మంత్రి సబిత నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు - degree students demand to cancel exams

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

students demand to cancel exams
మంత్రి సబిత నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు
author img

By

Published : Jul 5, 2021, 12:04 PM IST

మంత్రి సబిత నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు

ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ... తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. మంత్రి ఇంటి వద్ద ఓయూ, జేఎన్టీయూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. సత్యసాయి నిగమాగమం నుంచి మంత్రి సబితా నివాసం వరకు ర్యాలీగా వచ్చారు. కనీసం.. ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

కరోనా వేళ... జేఈఈ మెయిన్స్ , సీబీఎస్​ఈ లాంటి కేంద్ర పరీక్షలే వాయిదా వేసినప్పుడు... రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన వారికి ఈ మధ్యే టీకాలు వేయడం ప్రారంభించగా.... చాలా మంది విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకోలేదని అన్నారు. ముందు విద్యార్థులకు వ్యాక్సిన్ అందించి... తర్వాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇష్టమైన చోటే పరీక్ష..

ధర్నా చేస్తున్న విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు కోరిన చోట పరీక్షలు రాసే అవకాశం కల్పించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని తేల్చిచెప్పారు. అన్ని అంశాలను పరిశీలించాకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సబిత స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని ఆలోచించే ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని వివరించారు. ఉన్నతాధికారులతో చర్చించి ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్​లో పరీక్షల నిర్వహణ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు మంత్రి నివాసం వద్దే కూర్చుంటామని విద్యార్థులు అక్కడే బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా... వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

ఇదీ చదవండి :

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ అందుబాటులో లేని విద్యార్థుల కోసమే వీఎల్‌సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.