ETV Bharat / city

బ్లేడ్​తో విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి - Gachibowli iit Gurukul campus

student attacked with knife at Hyderabad: విద్యార్థుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఓ విద్యార్థి మరో విద్యార్థి గొంతుకోశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్​ గచ్చిబౌలిలోని బాలుర గురుకుల ఐఐటీ క్యాంపస్‌లో జరిగింది.

బ్లేడ్​తో విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి

author img

By

Published : Apr 29, 2022, 10:51 PM IST

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని బాలుర గురుకుల ఐఐటీ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి మరో విద్యార్థి గొంతుకోశాడు. దాడిలో విద్యార్థికి తీవ్ర రక్తస్రావం కాగా గచ్చిబౌలి ఆస్పత్రికి తరలించారు. సకాలంలో విద్యార్థికి చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.

ఈనెల 26న గురుకుల ఐఐటీ క్యాంపస్‌లో రాత్రి అల్పాహారం సమయంలో ఉప్మా ఓ విద్యార్థి చేయి మీద పడడంతో విద్యార్థుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో వారికి గురుకుల క్యాంపస్‌ టీచర్ సర్దిచెప్పి పంపించేశారు. కక్షతో అర్ధరాత్రి సమయంలో విద్యార్థిపై మరో విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.