ETV Bharat / city

ముగ్గుల పోటీలతో ముందే వచ్చిన సంక్రాంతి... - వివిధ జిల్లాల్లో సంక్రాంతి శోభ

తెలుగు ప్రజలు ఏటా సంప్రదాయబద్ధంగా జరుపుకునే సంక్రాంతి వేడుకలు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కోలాటాలు, ఎడ్ల పందాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రంలో పండుగ శోభ నెలకొంది. పలు చోట్ల ప్రజా ప్రతినిధులు ముగ్గుల పోటీలు నిర్వహించి.. మహిళలకు బహుమతులు పంచుతున్నారు.

sankranti celebrations in ap
ఏపీలో సంక్రాంతి సంబరాలు
author img

By

Published : Jan 12, 2021, 10:59 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి శోభ అలుముకుంటోంది. ఇప్పటికే పలు చోట్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు పెట్టి అద్భుతమైన రంగవల్లులతో మహిళల మోములో ఆనందోత్సాహాలు రేకెత్తిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, బొమ్మల కొలువులతో ఆద్యంతం ఆనందంగా సాగే కార్యక్రమాలు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో...

సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు ప్రజల ఇళ్లలో కనిపించే సందడి చెప్పలేని అనుభూతి కలిగిస్తుందని.. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో పెదకూరపాడు మండలం బలుసుపాడులో నాలుగు రోజులపాటు సంక్రాంతి సంబరాలు జరుగనున్నాయి. ఇవాళ ప్రారంభమైన ఈ వేడుకలకు.. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మతో కలిసి మంత్రి వనిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇప్పటి యాంత్రిక జీవితంలో మన తెలుగు సంప్రదాయాన్ని, సంస్కృతి ప్రతిబింబించేలా గొప్పగా సంక్రాంతి జరుపుకోవడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. సీఎం జగన్ ప్రజారంజక పాలనలో రాష్ట్రంలో ప్రతిరోజూ పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. తెలుగువారి సంప్రదాయం, వారసత్వం గుర్తుండి పోయేలా భారీస్థాయిలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషమని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే పండుగను ఈసారి ఘనంగా నియోజకవర్గ ప్రజల మధ్య జరుపుకోవడం మరువలేని అనుభూతి అని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురికి మంత్రి, మహిళా కమీషన్ ఛైర్మన్ చేతుల మీదగా నగదు బహుమతులు అందించారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ.. ట్రిపుల్​ ఎక్స్​ సబ్బుల సంస్థ అధినేత అరుణాచల మాణిక్యవేల్ చీరలను బహుమతిగా అందించారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. పండుగ విశిష్టతను తెలిపే రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, కోలాటాలతో కళాశాల ప్రాంగణం మారుమోగింది. గోమాత పూజతో మొదలుపెట్టి.. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు, హరిదాసు సంకీర్తనలు, డోలు, సన్నాయిలతో వినోద బృందం కనువిందు చేశాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు చేసుకునే వేడుకే సంక్రాంతి పండుగ అని ఆ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య తెలిపారు. మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. సంక్రాంతి పర్వదినాల్లో పల్లెటూళ్లు ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలపై గౌరవం పెంచాలనే ఉద్దేశంతో ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజ్ఞాన్ తెలిపారు.

ఫిరంగిపురం సెయింట్ పాల్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి బహుమతులు ప్రధానం చేశారు. మహిళలలో సృజనాత్మకతను వెలికి తీయడానికి ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని ఎంపీ అయోధ్యరామిరెడ్డి అన్నారు. వారిలో నైపుణ్యాలను బయటకు తేవడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

విశాఖలో...

తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి పండుగ వేడుకలను.. తెలుగువారు కొనసాగించడం ఆనందకరమని విశాఖ నగర వైకాపా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. చిన్న వాల్తేర్​లోని కనకమ్మ ఆర్చ్ వద్ద ముగ్గుల పోటీలను ఆయన ప్రారంభించారు. ఇందులో 70 మంది పాల్గొనగా.. వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు చేశామని.. రంగవల్లుల పోటీల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: కృష్ణా జలాల వినియోగ వివరాలపై తెలుగు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.