ఉద్యోగుల జీతాలు.. 3 వేల 200 కోట్లు, పెన్షన్లర్లకు పెన్షన్ల కోసం 13 వందల కోట్లు ఈ నెలకు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి మొత్తం 5వేల 500కోట్లు చెల్లింపులు జరగాలి. రాష్ట్ర ఖజానాలో నిల్వ వెయ్యి కోట్ల రూపాయలే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాండ్ల వేలం ద్వారా నిధులు సేకరించి వేతనాలు, పెన్షన్లు అందించాలని భావిస్తోంది. సోమవారం సెలవు కావడంతో మంగళ, బుధ వారాల్లో బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం నిధులు సేకరించనుంది. నిధుల సౌలభ్యం ఆధారంగా జీతాలు విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత నెలలోనూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సకాలంలో ఆమోదం పొందని కారణంగా ఉద్యోగులు జీతాలు ఆలస్యంగా అందుకున్నారు. ఈ నెలలో నిధుల కొరత వల్ల ఆలస్యం కానుంది.
ఇదీ చదవండి: రాజకీయ కక్ష కోసమే రాజధాని మార్పు: అమరావతి రైతులు