ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్‌డీసీ) ద్వారా ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్న రుణం రూ.24వేల కోట్లకు చేరినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్‌డీసీ ఏర్పాటు చేసి ఎనిమిది బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటోంది. ప్రభుత్వం రూ.25 వేల కోట్ల రుణానికి గ్యారంటీ ఇవ్వడమే కాకుండా రూ.వేల కోట్ల విలువైన విశాఖ ఆస్తులనూ తనఖా పెట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్ నుంచి రూ.18,500 కోట్లు రుణం తీసుకోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు మరో రూ.5,500 కోట్లు రుణం సమీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జూన్ నెలలో తనఖా ఆస్తుల డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత రూ.3,000 కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత మరో రూ.2,500 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఇక మరో వెయ్యి కోట్లు ఏపీఎస్‌డీసీ ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రుణం తీసుకునేందుకు ఆస్కారం ఉంది.
ఇదీ చదవండి: NTSE EXAM: 24న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష