ప్రైవేటు ల్యాబుల్లో చేస్తున్న కరోనా పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం.. ఓ ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో సుమారు 71.7 శాతం మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. సదరు ల్యాబ్‌లో 3,726 నమూనాలను పరీక్షించగా 2,672 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. ప్రైవేటు ల్యాబ్ ఫలితాలను మరోసారి తెలంగాణ వైద్యారోగ్య శాఖ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో సదరు ల్యాబ్ చేసిన పరీక్షల ఫలితాలను నిపుణుల కమిటీ పరిశీలించే వరకు ఆ గణాంకాలను పరిగణలోకి తీసుకోబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇవీ చూడండి:
కొవిడ్ ఆస్పత్రిలో వారం క్రితం వృద్ధుడు అదృశ్యం..మార్చురీలో మృతదేహం