ETV Bharat / city

ప్రముఖ సాహితీవేత్త వేల్చేరు నారాయణరావుకు గౌరవ ఫెలోషిప్

author img

By

Published : Mar 28, 2021, 4:14 AM IST

ప్రముఖ సాహితీవేత్త వేల్చేరు నారాయణరావుకు ప్రతిష్టాత్మకమైన గౌరవ ఫెలోషిప్​ను కేంద్ర సాహిత్య అకాడమీ అందజేసింది.

sahitya akademi fellowship
Professor Velcheru Narayana Rao

ప్రముఖ పండితులు తెలుగు భాష సాహిత్య పరిశోధకులు ఆచార్య వేల్చేరు నారాయణరావుకు ప్రతిష్టాత్మకమైన గౌరవ ఫెలోషిప్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అందజేసింది. విజయవాడ సిద్దార్ధ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు మాదవ్‌ కోషిక్‌ ఈ ఫెలోషిప్‌ను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా అంబఖండి గ్రామంలో 1931లో జన్మించిన వేల్చేరు నారాయణరావు.. సుమారు 20 ఏళ్లు తెలుగు సాహిత్య అధ్యాపకుడిగా పనిచేశారు. 1971లో అమెరికా వెళ్లారు. అక్కడ విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయంలో కృష్ణదేవరాయ పీఠం విశిష్ట ఆచార్యుడిగా 40 ఏళ్లపాటు తెలుగు భాష సాహిత్యాలను బోధించారు. భారతీయ మౌఖిక, సంప్రదాయ సాహిత్య సంస్కృతి చరిత్రలపై అనేక పరిశోధనలు చేసి అధ్యయన ఫలితాలను వెలువరించారు. తెలుగు భాష ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని నారాయణరావు ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్.. కారణం ఇదేనా..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.