ఏపీ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం కుడి కాలువ గట్టు, నాగార్జునసాగర్ కుడికాలువ జలవిద్యుత్ ప్రాజెక్టుల పర్యవేక్షణను కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించటానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
‘జలవనరుల శాఖ, తెలంగాణ జెన్‌కోతో సంప్రదింపులు జరిపి.. రికార్డులను అప్పగించటంలో వారు వ్యవహరించే తీరుకు అనుగుణంగా వ్యవహరించాలి. ప్రాజెక్టులను అప్పగించినప్పటి నుంచి అందులో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారాలను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకూ బోర్డు పర్యవేక్షిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది కలిపి 357 మంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పనిచేసే 63 మంది సిబ్బందిని అప్పగించాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: