ETV Bharat / city

దయచేసి వినండి... ప్రత్యేక బాదుడు కొనసాగుతుంది - భారత రైల్వేశాఖ వార్తలు

రెగ్యులర్‌ రైళ్లకు సంబంధించి ప్రయాణికుల ఆశలపై రైల్వేశాఖ నీళ్లు చల్లింది. ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్‌ నెలాఖరు వరకు, ఇంకొన్నింటిని జులై తొలివారం వరకు పొడిగించింది. మరికొన్నింటిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఫలితంగా ప్రయాణికులు మరో మూడు, నాలుగు నెలల పాటు అదనపు ఛార్జీలతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఆదాయాలు తగ్గిన ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

indian Special trains
భారత ప్రత్యేక రైలు ఛార్జీలు
author img

By

Published : Mar 21, 2021, 9:30 AM IST

గతేడాది మార్చిలో లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత దశలవారీగా అందుబాటులోకి వచ్చాయి. ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో 80శాతానికిపైగా పునరుద్ధరించినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల తిరుపతికి వచ్చిన సందర్భంలో ప్రకటించారు. ఆర్టీసీలు, విమానయాన సంస్థలు మామూలు ఛార్జీలతో రెగ్యులర్‌ సర్వీసులుగానే నడిపిస్తున్నాయి. రైల్వే శాఖ మాత్రం ‘ప్రత్యేకం’ పేరు చెప్పి దోచేస్తోంది. గోదావరి, శబరి, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు అవే బోగీలతో కొవిడ్‌కు ముందునాటి రూట్లలోనే, అవే సమయాల్లోనే ప్రయాణిస్తున్నాయి. ఆ రైళ్ల పాత నంబర్లకు ముందు ‘సున్నా’ కలపడం ఒక్కటే ప్రత్యేకం. ఉన్నవాటికి అదనంగా నడిపే రైళ్లు ప్రత్యేకం అవుతాయి. కానీ..రెగ్యులర్‌ రైళ్లనే రాయితీలు తీసేసి రైల్వేశాఖ ప్రత్యేకం పేరుతో నడిపిస్తోంది. దసరా, దీపావళి సమయాల్లో కొన్నింటిని పండగ ప్రత్యేక రైళ్లుగా పట్టాలు ఎక్కించింది. వీటిలో ఛార్జీలు పెంచింది. అదనపు ఛార్జీల కోసం వాటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది.

సీనియర్‌ సిటిజన్లకు ఎంత భారమో..

  • సీనియర్‌ సిటిజన్లయిన భార్యాభర్తలు ఇద్దరు సికింద్రాబాద్‌ నుంచి దిల్లీకి థర్డ్‌ ఏసీలో ప్రయాణించడానికి కరోనాకు ముందు రూ.2,105 ఖర్చయ్యేది. ఇప్పుడు రాయితీ లేకపోవడంతో రూ.4,240 అవుతోంది. రానూపోను రూ.4,270 వరకు పెరిగింది. ఫస్ట్‌ ఏసీ ప్రయాణం అయితే.. రానూపోను ఇద్దరికి కలిపి రూ.11,900 వరకు అదనపు భారం పడుతోంది.
  • సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు థర్డ్‌ ఏసీ ప్రయాణ ఖర్చుల్ని పరిశీలిస్తే.. కరోనాకు ముందు రాయితీ ప్రయాణంతో రూ.1,280 అయితే ఇప్పుడు చెల్లించాల్సింది రూ.2,670. రూ.1,390 పెరిగింది. రానూపోను రూ.2,780 భారం పడుతోంది. ..ప్రయాణమార్గం ఏదైనా ఇదే రకమైన భారం. వీరే కాదు విద్యార్థులు, వికలాంగులు, కళాకారులు.. ఇలా 51 రకాల రాయితీలు పొందేవారందరిపై రైల్వే శాఖ భారం మోపుతోంది. రాయితీలకు అవకాశం లేని సాధారణ ప్రయాణికులనూ పండగ ప్రత్యేక రైళ్ల పేరుతో బాదేస్తోంది.

ఇదీ చూడండి: 'టీకా చక్కగా పని చేస్తోంది.. ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.