ETV Bharat / city

Telangana New Secretariat: స్పెషల్​ పోలీస్​కు కొత్త సచివాలయ భద్రత బాధ్యత!

Telangana New Secretariat : కొత్త సచివాలయానికి కొత్త తరహా భద్రతా విధానాన్ని అమలు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ కాకుండా స్పెషల్ పోలీస్​కు సచివాలయ భద్రతా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 363 మంది సిబ్బంది పహారా కాసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Telangana New Secretariat
Telangana New Secretariat
author img

By

Published : Dec 9, 2021, 12:44 PM IST

Telangana New Secretariat : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి మొత్తం పనులను పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రాత్రింబవళ్లు మూడు పూటలా పనులు సాగుతున్నాయి. సువిశాలంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న సచివాలయ భవనం అందుబాటులోకి వచ్చాక భద్రతా విషయమై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

1999 నుంచి ఎస్పీఎఫ్..

Telangana New Secretariat Safety : ప్రస్తుతం సచివాలయ భద్రత బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ - ఎస్పీఎఫ్ నిర్వహిస్తోంది. 1999 నుంచి వీళ్లే ఈ బాధ్యతలను చూస్తున్నారు. పాత సచివాలయ భవనాలు ఉన్నన్నాళ్లు 245 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉండేవారు. సచివాలయాన్ని బీఆర్కేఆర్ భవన్​కు మార్చాక ఆ సంఖ్యను 87కు కుదించారు. బేగంపేట మెట్రో రైల్ భవనానికి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించాక అక్కడ 28 మందిని నియమించారు. నిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయ భవనం వద్ద మరో 18 మంది విధుల్లో ఉన్నారు. మొత్తం 131 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది సచివాలయ సంబంధిత విధుల్లో ఉన్నారు.

స్పెషల్ పోలీస్​కు బాధ్యతలు..

Special Police to protect Telangana Secretariat : నూతన సచివాలయం అందుబాటులోకి వచ్చాక భద్రతా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎస్పీఎఫ్ సిబ్బంది నాన్ ఆర్మ్డ్ ఫోర్స్ అయినందున సచివాలయం రక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎస్పీఎఫ్​కు బదులుగా కొత్త సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణా స్టేట్ స్పెషల్ పోలీస్​కు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం మూడు కంపెనీల టీఎస్ఎస్పీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదన అందింది. ఒక్కో కంపెనీలో 121 మంది సిబ్బంది ఉంటారు. మొత్తం 363 మంది సచివాలయ బాధ్యతల్లో ఉండే అవకాశం ఉంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో వీరు విధులు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.

Special Police in Telangana Secretariat Protection : సచివాలయం వెలుపల స్పెషల్ పోలీస్​తో పహారా కొనసాగించి లోపల ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.