ETV Bharat / city

ఆ వార్తలు అవాస్తవం... నాన్న ఇంకా వెంటిలేటర్​పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్​

author img

By

Published : Aug 18, 2020, 10:16 PM IST

కరోనా సోకి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నెలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్​ ఓ వీడియో ద్వారా తెలిపారు. వెంటిలేటర్​ తొలగించారనే వార్తల్లో నిజం లేదన్నారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఆ వార్తలు అవాస్తవం... ఇంకా వెంటిలేటర్​పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్​

ఎస్పీ బాలు ఆరోగ్యంపై కుమారుడు ఎస్పీ చరణ్​ స్పందన

ప్రముఖ గాయకుడు, తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. వెంటిలేటర్‌ తొలగించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

‘‘అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. సోమవారం ఏవిధంగానైతే ఉందో నేడూ అలాగే ఉంది. నాన్నగారికి వెంటిలేటర్‌ తొలగించినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజం కాదు. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆ రోజు రావాలని మేమూ ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుంది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము దృఢంగా నమ్ముతున్నాం. మీ దీవెనలు ఆయనకు కావాలి. ఇలాగే మీ ప్రేమాభిమానులను కొనసాగించండి. ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, గాయకులు ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్ర 6గంటలకు యూనివర్సల్‌ మాస్‌ ప్రేయర్‌ పేరిట ఒకేసారి ప్రార్థనలు నిర్వహించారు. ఎస్పీ బాలు ఆరోగ్యంపై భావోద్వేగానికి గురైన ఉత్తేజ్‌.. బాలు పాటలు వింటూ పెరిగిన తాను ఆ పాటలు తనను రక్షించాయని పేర్కొన్నారు. అన్నయ్య క్షేమంగా తిరిగి వచ్చి మళ్లీ పాటలు పాడతారని బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇవీ చూడండి:

జలవివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.