ETV Bharat / city

విరబూసిన తెలుగు పద్మాలు: బాలుకు పద్మవిభూషణ్.. ముగ్గురికి పద్మశ్రీ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి.. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి ముగ్గురిని, తెలంగాణ నుంచి ఒకరిని పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారిలో విజయవాడకు చెందిన వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, దేశంలో తొలి మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి ఉన్నారు.

author img

By

Published : Jan 26, 2021, 12:04 PM IST

గాన గంధర్వునికి పద్మ విభూషణ్‌
గాన గంధర్వునికి పద్మ విభూషణ్‌

ఎస్పీ బాలుకు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం

గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి.. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురిని పద్మవిభూషణ్‌కు, 10 మందిని పద్మభూషణ్‌కు, 102 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. బాలుకు తమిళనాడు కోటాలో పద్మవిభూషణ్‌ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి ముగ్గురిని, తెలంగాణ నుంచి ఒకరిని పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారిలో విజయవాడకు చెందిన వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, దేశంలో తొలి మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి ఉన్నారు.

అవధానంలో దిట్ట.. ఆశావాది

గాన గంధర్వునికి పద్మ విభూషణ్‌

అనంతపురం జిల్లాకు చెందిన అవధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు 1944 ఆగస్టు 2న కుళ్లాయమ్మ, పక్కీరప్ప దంపతులకు జన్మించారు. ఈయన స్వగ్రామం శింగనమల మండలం పెరవలి. ఎస్‌ఎస్‌ఎల్‌సీ నుంచి ఎంఏ (తెలుగు) వరకు అనంతపురంలోనే చదువుకున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు చేశారు.

మృదంగంతో మార్మోగిన పేరు

గాన గంధర్వునికి పద్మ విభూషణ్‌

మృదంగ వాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన తొలి కళాకారిణి, విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి. విజయవాడలో నివాసముంటున్న ఆమె సంగీత కళాకారిణిగా సుప్రసిద్ధురాలు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. మృదంగ విద్వాంసులైన తండ్రి నిడుమోలు రాఘవయ్య వద్దే ఆమె శిష్యరికం చేసి చిన్నప్పుడే పట్టు సాధించారు. పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి అనేక మంది ప్రముఖులకు ఆమె వాద్య సహకారం అందించారు. 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది.

పల్లవించిన సంగీతం

గాన గంధర్వునికి పద్మ విభూషణ్‌

విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి. ఆయన తండ్రి పెంటయ్య నాదస్వర విద్వాంసులు. రామస్వామి ప్రస్తుతం సూర్యారావుపేట వేమూరివారివీధిలో నివసిస్తున్నారు. గత 8 దశాబ్దాలుగా అనేక దేశాల్లో కచేరీలు చేశారు. ఆయన వందన, శ్రీదుర్గా అనే కొత్త రాగాలను, త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు.

ఇదీ చదవండి:

18 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర పురస్కారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.