తండ్రి మృతదేహాన్ని కొడుకు ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన అమానవీయ సంఘటన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో జరిగింది. కరోనా లక్షణాలతో ఉదయం సిద్దిపేట ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు సాయంత్రం 4 గంటలకు మృతి చెందాడు. తండ్రి మరణవార్తను కుమారునికి తెలియజేసిన వైద్యసిబ్బంది... మృతదేహాన్ని అప్పగించారు.
అంబులెన్సులో ఎక్కించే వరకు అక్కడే ఉండి... ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నాడు. చేసేదేమీలేక వృద్ధుడి శవాన్ని సిబ్బంది సిద్దిపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుమారుడి నిర్వాకంపై ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి.
ఇవీ చూడండి: