ఆ ముసలి తల్లిది 93 ఏళ్ల వయసు. ఆ ముదిమి వయసున నీడలా తోడుండాల్సిన కొడుకే ఆమె పాలిట కాలయముడయ్యాడు. నవ మాసాలు మోసి, కని, పాలిచ్చి పెంచిన తల్లి పైనే దారుణంగా చేయిచేసుకున్నాడు. అతగాడి దాష్టీకానికి విలవిలలాడిన ఆ మాతృమూర్తి చికిత్స పొందుతూ మృతిచెందింది. తెలంగాణ రాష్ట్రం భువనగిరి గ్రామీణ సీఐ జానయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడేనికి చెందిన బాతుక ధనమ్మకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి పెళ్లిళ్లయ్యాయి. ధనమ్మ భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయాడు.
కోడలు ట్రాక్టర్‌పై ప్రమాదంలో కన్నుమూసింది. ఈ నేపథ్యంలో కుమారుడు మల్లయ్య తల్లి దగ్గరే ఉంటున్నాడు. ఈ నెల 20న తాగి ఇంటికి వచ్చిన మల్లయ్యకు తల్లి ధనమ్మ అన్నం పెట్టలేదు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో మల్లయ్య తన తల్లి ఛాతీపై చేతితో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు స్పృహ కోల్పోయింది ...ధనమ్మను స్థానికులు భువనగిరి జిల్లా ఆసుపత్రికి.. అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం సాయంత్రం మరణించింది. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ జానయ్య తెలిపారు.
ఇదీ చదవండి: