Somu verraju: ప్రత్యేక హోదాకు, తెలంగాణకు ఎలాంటి సంబంధమూ లేనందునే అజెండా నుంచి తొలగించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ప్రత్యేకంగా చర్చించవచ్చు అన్నారు. ఈనెల 17న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారన్న సోము.. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించబోతున్నారని తెలిపారు.
ఏపీలో 23 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం పనులు చేస్తోందని.. ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయని, మరికొన్ని జగుతున్నాయని అన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రికి గతంలో ప్రభుత్వం భూమి ఇచ్చిందని.. జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ముస్లింలకు.. రాష్ట్రంలో 5 శాతం రిజర్వేషన్ ఇచ్చారని.. అదే విధంగా కాపులకు కూడా ఇవ్వాలని జీవీఎల్ ప్రస్తావించారన్నారు. ఈ ప్రభుత్వానికి ముస్లింలు అంటే ప్రేమ.. కాపులంటే ద్వేషమా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు కార్మికుల ‘జైల్ భరో’.. కార్మికుల అరెస్ట్