రాష్ట్ర భాజపాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కన్నా లక్ష్మీనారాయణను భాజపా రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.
సోము వీర్రాజుకు నాలుగు దశాబ్దాలుగా ఆర్‌ఎస్‌ఎస్, భాజపాతో అనుబంధముంది. సుదీర్ఘకాలం భాజపా కార్యవర్గంలో పని చేశారు. రాజమహేంద్రవరం పరిధి కాతేరు గ్రామానికి చెందిన సోము వీర్రాజు... ప్రస్తుతం ఎమ్మెల్సీ, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను భాజపాతో కలపడంలో కీలకపాత్ర పోషించారు. గతంలో అధ్యక్ష పదవికి హరిబాబు తర్వాత ప్రముఖంగా వీర్రాజు పేరు వినిపించగా ఆఖరి నిమిషంలో కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి వరించింది.
ఇదీ చూడండి..