విద్యుత్ ఎగుమతి విధానంలో 17,800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 7చోట్ల అవకాశం ఉందని నెడ్‌క్యాప్ గుర్తించింది. వీటిని 2022 నాటికి పూర్తిచేయాలని భావిస్తోంది. వాటి ఏర్పాటుకు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 80 వేల ఎకరాలను గుర్తించింది. ప్రతిపాదించిన 17,800 మెగావాట్లలో.. 9వేల మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు పలు సంస్థలు నెడ్‌క్యాప్‌ను సంప్రదించాయి. కొవిడ్ నేపథ్యంలో సంప్రదింపులు కొలిక్కి రావటం ఆలస్యమైంది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రూ.89వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని నెడ్‌క్యాప్ అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా తలుపుల, ఓబుళదేవరచెరువు, రాళ్లఅనంతపురం, కడప జిల్లా బద్వేల్, కలశపాడు, కర్నూలు జిల్లా అవుకు, కొలిమిగుండ్లలలో ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములను గుర్తించారు.
ఇక్కడే ప్రాజెక్టులకు అవకాశం: నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి
రాజస్థాన్, గుజరాత్ తర్వాత రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో (పీపీఏ) సంబంధం లేకుండా విద్యుత్ ఎగుమతి విధానంలో ప్రాజెక్టులను సంస్థలు ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ ఉత్పత్తిచేసిన విద్యుత్‌ను బయటి రాష్ట్రాలకు తీసుకెళ్లటానికి సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. అనంతపురంలోని ఓబుళదేవరచెరువు, కదిరి, కడపలోని బద్వేలు దగ్గర సబ్‌స్టేషన్లను ప్రతిపాదించాం. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ కర్నూలు జిల్లాలో 5,500 మెగావాట్లు, అనంతపురంలో 2,500 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటుచేస్తుంది.
ఇదీ చదవండి: