పది తప్పినా నైపుణ్య డిగ్రీ అందించేలా రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఆ వర్శిటీ ద్వారా పదో తరగతి ఉత్తీర్ణులు కాని వారికి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ పట్టా పొందే అవకాశం కల్పించనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా ప్రవేశాలు కల్పించడం సహా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులు కాలేక పోయిన వారికి క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చి మరీ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ మేరకు సూచనలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి నైపుణ్యాభివృద్ధి సంస్థకు పూర్తిస్థాయి నివేదిక అందించింది.
18 కోర్సులు.. ఏడాదికి రెండు బ్యాచ్‌లు
ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనా లేక మరో పంథాలోనైనా ఏర్పాటు చేయాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ వర్శిటీలో 18 కోర్సులు ఉండనున్నాయి. ఏడాదికి రెండేసి బ్యాచ్‌లు ఉండనున్నాయి. బ్యాచ్‌కు 30 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో కళాశాలతో పాటు పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ కూడా ఉండనుంది. లోక్‌సభకు ఒకటి చొప్పున ఏర్పాటు కానున్న 25 బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను వర్శిటీకి అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్న విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ సిఫార్సులు చేసినట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి :