ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వైకాపా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడ్డారు. రాజధాని మారిస్తే.. పెట్టుబడులు రావని.. యువత ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని సింగపూర్‌లోని హై కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన లేఖలో ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహనా రాహిత్య నిర్ణయాలు తీసుకుంటే.. ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం ఉండదని లేఖలో వివరించారు. మూడు రాజధానులు వద్దని శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలు, రైతులపై ప్రభుత్వం చేస్తున్న దాడులు సరికాదని ప్రవాసాంధ్రులు.. హై కమిషన్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. ఈ విషయాన్ని ఇండియాలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని భారత హై కమిషన్ అధికారులు చెప్పినట్లు ప్రవాసాంధ్రులు వెల్లడించారు.
ఇదీ చదవండి: