ETV Bharat / city

ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్ - మాస్కుల పంపిణీ

కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. హాట్​స్పాట్లలో తొలుత మాస్క్​ల పంపిణీ చేపట్టాలని చెప్పారు. మాస్క్​ల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని సూచించారు.

cm jagan
cm jagan
author img

By

Published : Apr 16, 2020, 3:24 PM IST

కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. భౌతికదూరం కచ్చితంగా పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మాస్క్‌ల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మొదటగా మాస్క్‌లను పంపిణీ చేయాలన్నారు. ప్రతి మనిషికి మూడు మాస్క్‌లు అందించాలన్నారు. రేపటినుంచి మాస్కుల పంపిణీ ప్రారంభిస్తామని.... రెండు, మూడ్రోజుల తర్వాత పంపిణీని వేగవంతం చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

రూ.2 వేల సాయం..
రైతు భరోసాతో పాటు మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని జగన్‌ ఆదేశించారు. అలాగే ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న పేదలకు ఆర్థిక సాయం చేయాలని ఆదేశించిన జగన్‌.... ఇంటికి పంపేటప్పుడు వారికి 2వేల రూపాయలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇచ్చే డబ్బుతో పాలు, గుడ్డు, కూరగాయలు లాంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వారికి సూచించాలన్నారు. క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆగని కరోనా... 534కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.