మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడారంటూ నోటీసు ఇచ్చింది. ఈసీ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియా సమావేశంలో వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరింది.
ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు కొడాలినాని బహిరంగ ప్రకటన చేయాలని... సాయంత్రం 5 గంటల్లోగా మంత్రికానీ, ప్రతినిధి ద్వారా కానీ సమాధానం ఇవ్వాలని ఎస్ఈసీ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి:
పంచాయతీ ఎన్నికలపై.. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్: ఎస్ఈసీ