రాష్ట్రంలోని జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు (AP junior doctors) సమ్మె సైరన్ మోగించారు. ఆరోగ్య బీమా(health insurence), ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈనెల 9 నుంచి విధులు బహిష్కరించనున్నట్లు జూనియర్ రెసిడెంట్ వైద్యులు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు (Strike Notice) ఇచ్చారు. ఆరోగ్య బీమా, పరిహారం కల్పించాలని.. జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని కోరారు. స్టైఫండ్‌లో టీడీఎస్ కట్ చేయకూడదని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ.. ఈనెల 9న కొవిడ్‌యేతర విధులు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ రెసిడెంట్ వైద్యులు ప్రకటించారు. ఈనెల 10న కొవిడ్ సంబంధ విధులు బహిష్కరిస్తామన్నారు. ఈనెల 11న కొవిడ్‌యేతర అత్యవసర విధుల్లో పాల్గొనబోమని తెలిపారు. ఈనెల 12న కొవిడ్ (covid 19) సంబంధ అత్యవసర విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: