ETV Bharat / city

సిగరెట్లు అమ్మేవారికి హెచ్చరిక.. ఇకపై ఆ ప్రాంతాల్లో..!

author img

By

Published : Aug 23, 2021, 8:09 AM IST

విద్యాసంస్థలకు వంద గజాల్లోపు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పాఠశాల, ఉన్నత విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే విద్యా సంస్థల ప్రాంగణాల్లో ‘పొగాకు రహిత ప్రాంతం’ అని తెలిపేలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Selling cigarettes is fine
సిగరేట్లు అమ్మితే జరిమానా

విద్యా సంస్థల ప్రహరీల నుంచి వంద గజాల (300 అడుగులు) లోపు ఎక్కడా సిగరెటు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా పక్కా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పాఠశాల, ఉన్నత విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం 2007 - 08లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 21 ప్రభుత్వ శాఖలు పొగాకు నియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంది. అయితే.. ఇది అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నుంచి తాజాగా వచ్చిన ఆదేశాలను అనుసరించి వైద్య ఆరోగ్య శాఖ పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విద్యా సంస్థలకు దగ్గర్లో నిబంధనలను అతిక్రమించి దుకాణాల్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించేవారికి రూ.20 నుంచి రూ.200 వరకు జరిమానా విధించే అధికారం ఇతర శాఖల అధికారులతోపాటు హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు కూడా ఉంటుంది. అయితే ఈ విషయం అనేక మంది తెలియదు. కొందరికి తెలిసినా పట్టించుకోవడంలేదు.

ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు ఉన్న అధికారాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే విద్యా సంస్థల ప్రాంగణాల్లో ‘పొగాకు రహిత ప్రాంతం’ అని తెలిపేలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలని, పొగాకు నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను 6నెలలకు ఒకసారి నిర్వహించాలని హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లను వైద్య ఆరోగ్యశాఖ కోరింది. విద్యాసంస్థల్లో నిర్వహించే ఈ కార్యక్రమాలను సంబంధిత ఏఎన్‌ఎంలు తమ మొబైల్‌ ఫోన్‌లలోని ‘హెల్త్‌’ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

endowment board : చిన్న ఆలయాలపై దేవాదాయశాఖ కసరత్తు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.