రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో విడత ప్రక్రియ జరుగుతోంది. మున్సిపల్ ,పోలీస్, రెవెన్యూ ,104,108 సిబ్బందికి ఈ విడతలో కొవిడ్ టీకాలను వేస్తున్నారు. రెండో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియలో 996 సెషన్ సైట్స్ లో 28వేల72 మందికి టీకాలు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2843 మంది టీకాలు తీసుకున్నారు .అత్యల్పంగా విజయనగరంలో 1317 మంది వ్యాక్సినేషన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో ఇద్దరు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి