తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నేడు, శనివారం.... మూడు జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించినున్న ఆయన అధికారులతో సమీక్షించి తగు ఆదేశాలు జారీచేయనున్నారు. ఇవాళ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎస్ఈసీ పర్యటన సాగనుంది.
ఈ ఉదయం విజయవాడ నుంచి విమానంలో బయల్దేరి బెంగళూరుకు చేరుకుని.... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తారు. మధ్యాహ్నం రెండున్నర వరకు అనంతపురం జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షిస్తారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, బందోబస్తుపై చర్చించి ఆదేశాలు జారీచేయనున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు అనంతపురం నుంచి బయల్దేరి సాయంత్రం ఐదున్నర గంటలకు కర్నూలుకు నిమ్మగడ్డ చేరుకుంటారు. ఏడున్నర గంటల వరకు కర్నూలు జిల్లా అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రికి కర్నూలులో బస చేయనున్న రమేశ్‌కుమార్.... శనివారం ఉదయం 6 గంటలకు కడప బయల్దేరతారు. శనివారం ఉదయం 9 గంటలకు కడప జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 11న్నర గంటలకు కడప నుంచి విజయవాడ బయల్దేరతారు..
ఇదీ చదవండి: