ETV Bharat / city

పని ప్రదేశాల్లో ప్రమాదాలపై.. మారని దర్యాప్తు తీరు: ‘సైంటిస్ట్‌ ఫర్‌ పీపుల్‌’ నివేదిక - పరిశ్రమల్లో ప్రమాదాలు తాజా వార్తలు

రాష్ట్రంలోని పలు పరిశ్రమల్లో తరచూ ప్రాణాంతకమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. రక్షణ విధానాలు ఏ మాత్రం మెరుగుపడలేదని ‘సైంటిస్ట్‌ ఫర్‌ పీపుల్‌’ తన నివేదికలో అభిప్రాయపడింది. ప్రమాదాలపై శాస్త్రీయంగా దర్యాప్తు సాగుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. సరైన రక్షణ ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలను అరికట్టలేక పోతున్నారని తెలిపింది.

scientist for people report in ap industries
‘సైంటిస్ట్‌ ఫర్‌ పీపుల్‌’ నివేదిక
author img

By

Published : Jun 20, 2021, 7:34 AM IST

భోపాల్‌ విషవాయువు విపత్తు సంభవించి నాలుగు దశాబ్దాలు దాటినా.. పనిప్రదేశాల్లో మన రక్షణ విధానాలు ఏ మాత్రం మెరుగుపడలేదని ‘సైంటిస్ట్‌ ఫర్‌ పీపుల్‌’ నివేదిక అభిప్రాయపడింది. గతేడాది విశాఖలో స్టైరీన్‌ విడుదలై ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్రంలో తరచూ ప్రాణాంతకమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు సాగుతున్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. వీటిపై విచారణకు నియమించిన సంయుక్త నిపుణుల కమిటీ నివేదికలు పేలవంగా ఉన్నాయని పేర్కొంది.

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియా పరిధిలోని వెంకట నారాయణ యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (వీఎన్‌ఏఐ)లో మే 11న గ్యాస్‌ లీకై నలుగురు మృతి చెందిన ఘటనపై ‘సైంటిస్ట్‌ ఫర్‌ పీపుల్‌’ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి నివేదిక సమర్పించింది. కర్మాగారం, జిల్లా కలెక్టర్‌, ప్రమాదంపై దర్యాప్తు జరిపిన సంయుక్త నిపుణుల కమిటీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

రక్షణ విధానాలు పాటించకపోవడం, పర్యవేక్షణ కొరవడటంతోనే వీఎన్‌ఏఐలో 9 నెలల్లో రెండు ప్రాణాంతకమైన ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ డాక్టర్‌ కె.బాబూరావు, బాంబే ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్‌ వి.జి.రావు, మాజీ శాస్త్రవ్తేత డాక్టర్‌ కె.వెంకటరెడ్డి రూపొందించిన ఈ నివేదికను ఎన్జీటీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ‘వీఎన్‌ఏఐలో గతేడాది జులై 29న పేలుడు సంభవించి ముగ్గురు, ఈ సంవత్సరం మే 11న గ్యాస్‌ లీకై మరో నలుగురు మృత్యువాతపడ్డారు.

వీఎన్‌ఏఐలో గ్యాస్‌ లీకేజీపై దర్యాప్తునకు సహకరిస్తామంటూ మేం కలెక్టర్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదు. ఎన్జీటీ సుమోటోగా కేసును స్వీకరించి, విచారణకు సంయుక్త నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించినా దాన్ని వారు ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. ఓ అజ్ఞాత వ్యక్తి మాకు పంపిన ఆ నివేదికలను చూస్తే.. నిపుణుల కమిటీ సభ్యులు సరైన ప్రశ్నలు అడగలేదని తెలుస్తోంది. నివేదికలో ప్రమాద చిత్రాలూ లేవు. మాకు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా గతేడాది జులై ప్రమాదానికి కారణం హైబ్రిడ్‌ డస్ట్‌/వేపర్‌ పేలుడు. మిథనాల్‌ పేలుడు కాదు’ అని నివేదికలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

హడలెత్తిస్తున్న బ్లాక్‌ఫంగస్‌ కేసులు, మరణాలు

మీ ఫోన్​లో ఈ యాప్స్​ ఉన్నాయా? జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.