ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కుంభకోణంలో మరికొందరి ప్రమేయం ఉందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తేల్చింది. ఏపీ సచివాలయంలోని కొందరి ఉద్యోగుల పాత్రను ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రూ.117 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గతంలోనే గుర్తించారు. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసు నమోదైంది. కాగా, ఈ కుంభకోణంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు.. ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో నిధులు స్వాహా చేసినట్లు తాజాగా గుర్తించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ తేల్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు 50 మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.
CMRF Scam: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం..!
13:22 September 22
సచివాలయంలోని కొందరు ఉద్యోగుల పాత్రను గుర్తించిన అనిశా