ETV Bharat / city

తప్పని చెప్పినందుకు.. సర్పంచ్ భర్త బూతు పురాణం! - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

రిజర్వాయర్ స్థలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం వల్ల భవిష్యత్​లో​ ఇబ్బంది వస్తుందన్నందుకు.. ఓ యువకుడిని సర్పంచ్ భర్త​ దుర్భాషలాడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా గండిపల్లిలో జరిగింది. సర్పంచ్ భర్త​ తీరు పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

sarpanch husband abused a young boy
తప్పని చెప్పినందుకు సర్పంచ్ భర్త బూతుపురాణం!
author img

By

Published : Jan 23, 2021, 3:13 PM IST

sarpanch husband abused a young boy
బాధిత యువకుడు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామ రిజర్వాయర్ స్థలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం వివాదానికి దారి తీసింది. గత 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన గండిపల్లి ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. ఎలాంటి పనులు జరగకపోయినా భవిష్యత్​లో తిరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రిజర్వాయర్​ పూర్తయితే ఈ పైప్​లైన్ మునిగిపోతుంది. పైప్ లైన్​కు ఏదైనా మరమ్మతులు చేయాల్సి వస్తే.. నీటిలో ఉన్న పైప్ లైన్​కు మరమ్మతులు చేయడం కుదరదు. ఇదే విషయాన్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫోన్​లో సర్పంచ్ భర్త​ దృష్టికి తీసుకెళ్లాడు. ​స్పందించిన సర్పంచ్​ భర్త.. యువకుడిని దుర్బాషలాడాడు. యువకుడిని దూషించిన సర్పంచ్ భర్త తీరు పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా వేస్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను ఆపించి.. రిజర్వాయర్​ అవతలి నుంచి పైప్ లైన్​ను వేయించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'రెండున్నరేళ్లుగా ఎన్నికలు జరగలేదు.. ఇప్పుడు అత్యవసరమా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.