ETV Bharat / city

సర్పంచిగిరి.. అంత ఈజీ కాదు గురూ..! - Sarpanch elections

రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలే ఇప్పుడు హాట్ టాపిక్. సర్పంచి పదవిపై అందరికీ ఆశే ఉంటుంది. గౌరవం, దర్పం, అధికారం.. ఇవన్నీ సర్పంచి సొంతం. సర్పంచి కావాలని ఎవరు అనుకోరు చెప్పండి. అవ్వాలనే ఆశ ఉన్నా... అవకాశం కొందరికే వస్తుంది. ఆ ఛాన్స్ కొట్టేసిన వాళ్లూ గౌరవం పొందడంతో పాటు... అనేక సవాళ్లు, సర్దుబాట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో... కొన్నిచోట్ల సర్పంచి గిరి కత్తి మీద సాములాంటిదే..!

Sarpanch Duties in Andhra Pradesh
Sarpanch Duties in Andhra Pradesh
author img

By

Published : Feb 3, 2021, 7:58 PM IST

సర్పంచి... ఈ హోదాకున్న స్థాయి, స్థానం వేరు. సేవ చేయాలనే ఆలోచన ఉండాలే గానీ.. అపార అవకాశాలుంటాయి. విమర్శలు, ఆరోపణలూ ఎదుర్కొక తప్పదు. సర్పంచి పదవి పూలబాటేం కాదు. సవాళ్ల, సమస్యల బాటే. ఎన్నికలప్పుడు ఉన్న పరిస్థితి ఎన్నికయ్యాక, గెలిచాక ఉండదు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజల ప్రశ్నలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నిధులు, ఆదాయం వంటి విషయాలు ప్రజలకు అనవసరం... వారికి కావాల్సింది సమస్యలు పరిష్కారమే. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది.

పైనుంచి నిధులు రాకపోతే..

గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా... పంచాయతీకి వచ్చే ఆదాయం సరిపోదు. ప్రభుత్వాల నుంచి నిధులు అవసరం. ప్రస్తుతం ఉన్న 'ఆర్థిక' కష్టాల్లో ప్రభుత్వాలు పంచాయతీలకు చాలినన్ని నిధులు ఇచ్చే అవకాశం తక్కువే. అలాంటప్పుడు పల్లెలను అభివృద్ధి చేయడం కష్టం. పైన పరిస్థితి ఎలా ఉన్నా గ్రామాల్లో నిందలు మోయాల్సింది సర్పంచులే..! అధికార పార్టీ బలపర్చి గెలిచిన వారికి ఇది ఇంకా పెద్ద సమస్య. ప్రతిపక్ష పార్టీల మద్దతుతో గెలిచిన అభ్యర్థులైతే.. నెపం ప్రభుత్వంపై నెట్టేయొచ్చు..!

గత అనుభవాలెన్నో...

గతంలో సర్పంచి పదవి చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఎందరో ఉన్నారు. ఆస్తులు అమ్ముకున్నవారూ ఉన్నారు. పరువుకు పోయి పల్లెను ఎంతోకొంత అభివృద్ధి చేసిన నాయకులు ఉన్నారు. అయినా విమర్శలు ఎన్నో. గ్రామానికి ఏదో చేద్దామని అనుకొని.. సర్పంచిగా పోటీచేసి గెలిచి... అప్పులపాలైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సర్పంచి పదవి అలంకారప్రాయం కాదు. అలా అనుకొని పోటీచేస్తే.. తప్పులో కాలేసినట్టే..!

దేనికైనా సిద్ధంగా ఉండాలి...

సర్పంచి స్థానంలో ఉన్న వ్యక్తిపై పూలు పడతాయి, విమర్శలు, ఆరోపణలనే రాళ్లూ పడతాయి. అవన్నీ స్వీకరించిన వారే నిజమైన సర్పంచిగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పొగడ్తలకు పొంగకుండా... విమర్శలకు కుంగకుండా... పరిస్థితులకు అనుగుణంగా మారి పనిచేస్తేనే గుర్తింపు వస్తుంది. గతంలో ఎందరో సర్పంచులు అనేక ఇబ్బందులను ఎదుర్కొని తమతమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. అలాంటి వారిని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగితే మీరే బెస్ట్... మీకు ఆల్​ ద బెస్ట్.

సమాచారం...

తొలిదశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో... సర్పంచి పదవి కోసం మొత్తం 19,491 నామినేషన్లు దాఖలయ్యాయని ఎస్‌ఈసీ వెల్లడించింది. సర్పంచి అభ్యర్థుల 2,386 నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికాగా.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,125 సర్పంచి నామినేషన్లను తిరస్కరించారు.

ఇదీ చదవండీ... 'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.