రాష్ట్రవ్యాప్తంగా ఇసుక టెండర్లు దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా తవ్వకాలు, విక్రయాలను వచ్చే వారంలో ఆరంభించేందుకు కసరత్తు జరుగుతోంది. తొలుత ఏప్రిల్ 6 నుంచి ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని భావించగా, గనులశాఖలోని కీలక అధికారి కరోనా బారినపడటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఈ నెల 11 నుంచి గానీ, 16 నుంచి అయినా బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈలోపు గనులశాఖ విధివిధానాలు సిద్ధం చేశాక, గుత్తేదారు సంస్థతో ఒప్పంద ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తూర్పుగోదావరిలో ఓపెన్ రీచ్‌ల నిలిపివేత
తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదిలో 40 వరకు ఓపెన్ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతుండగా, కొద్ది రోజుల కిందట వీటిని పూర్తిగా నిలిపేశారు. ఇసుక తవ్వకాలు, రవాణా బాధ్యతలను చేపట్టిన కొందరు గుత్తేదారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో వీటిని నిలిపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ జిల్లాలో నాలుగైదు చోట్ల పట్టా భూముల్లోను, కొన్ని బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: 'కేసు సీబీఐ చేతిలో ఉందని తెలిసీ జగన్ బాబును విమర్శిస్తున్నారు'