తెలంగాణ ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అనుమతుల పేరిట ఇసుక దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుకను తరలించి కాసుల జల్లెడ పడుతున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి శివారులోని వాగు నుంచి కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు సిద్ధం చేసి ఇసుకను తోడేస్తున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు వాగు వద్దకు వెళ్లారు. అక్రమ ఇసుక రవాణా ఆపివేయాలని హెచ్చరించిన పోలీసులపై ఇసుక మాఫియా దాడికి దిగింది. కర్రలు, రాళ్లతో పోలీసులను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్దఎత్తున రావడం వల్ల ఇసుకాసురులు అక్కణ్నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో వారు.. వాగులోనే 5 ట్రాక్టర్లను వదిలి వెళ్లారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: