పెట్రో ధరలపై భాజపా ధర్నాలు చేయడం ఏమిటని..? ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు(sajjala ramakrishna reddy slams bjp govt news). కేంద్రం తగ్గించింది తక్కువ, రాష్ట్రాల నుంచి పిండేది ఎక్కువ అని విమర్శించారు. కేంద్రం వసూలు చేసే పన్నులను ఎక్సైజ్ డ్యూటీ కిందకు తేవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ కిందకు తెస్తే రాష్ట్రాలూ తగ్గిస్తాయని అన్నారు. కేంద్రం అన్ని సెస్‌లు తగ్గిస్తే రూ.50కే పెట్రోల్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో అక్రమాలు లేవు: సజ్జల
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు లేవని సజ్జల (sajjala on local elections news) స్పష్టం చేశారు. అభ్యర్థులు కానివారితో సంతకాలు చేయించడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఓటమి భయం ఉన్నవారే కుంటిసాకులు చెబుతారని వ్యాఖ్యానించారు.
విలీనంపై బలవంతం లేదు..
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై స్పందించిన సజ్జల... ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా బలవంతం చేయడం లేదన్నారు. 101 విద్యాసంస్థలు ప్రభుత్వంలో పూర్తి విలీనానికి ఒప్పుకున్నాయని వెల్లడించారు. అనంతపురం విద్యార్థులపై లాఠీఛార్జ్ అనేది తప్పుడు ప్రచారమన్నారు. గాయపడిన అమ్మాయి.. బయటి నుంచి వచ్చినట్లు తెలుస్తోందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా..? అంటూ ప్రతిపక్షాలను నిలదీశారు.
'అనంతపురం విద్యార్థులపై లాఠీఛార్జ్ అని తప్పుడు ప్రచారం. గాయపడిన అమ్మాయి బయటినుంచి వచ్చిందని తెలుస్తోంది. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా? ఎయిడెడ్ విద్యాసంస్థలను ఎక్కడా బలవంతం చేయడం లేదు. 101 విద్యాసంస్థలు ప్రభుత్వంలో పూర్తి విలీనానికి ఒప్పుకున్నాయి' - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు
ఇదీ చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. భాజపా నేతలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్