ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తామని ఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత తెలిపారు. ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. వంద శాతం విజయవాడలోని ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. అందులో సుజాత మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగుల సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దశదిశ లేక, ఎలా పోరాడాలో తేల్చుకోలేని అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులంతా ఉన్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులంతా ఆశించారన్నారు. కానీ వారితో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు 19% ఐఆర్ తేడా ఉందన్నారు. గతంలో నాలుగేళ్లకోసారి ఆర్టీసీలో వేతన సవరణ ఉండేది. ఇప్పుడు పదేళ్లకోసారి అనడంతో ఉద్యోగులంతా అవాక్కయ్యారన్నారు. గతంలో 16% ఉన్న హెచ్‌ఆర్‌ఏను ఇప్పుడు 8%కు తగ్గించడం దారుణమని సుజాత వాపోయారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో సదుపాయాలను కోల్పోయారని తెలిపారు.
RTC IN STRIKE: "రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తాం" - rtc in prc strike
పీఆర్సీపై ఉద్యోగులు చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగుల సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.