తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తొర్రూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు మార్గమధ్యలోనే ఊడిపోయాయి. గమనించిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనలో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
మరోవైపు కాటేపల్లి నుంచి రాయిపల్లి వైపు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండటంతో ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా లేదని డ్రైవర్ తెలిపారు. ఆ కారణంగానే బస్సు ఎడమవైపు చక్రాలు ఊడిపోయాయని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి:
vijayasai letter to pm: నక్సల్స్‌కి సంబంధం లేదు.. వారు వచ్చి ట్రాక్‌ను దెబ్బతీయటం సాధ్యం కాదు!