ETV Bharat / city

మద్యం మత్తు : బైక్​ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి - మాదాపూర్​ సైబర్​ టవర్స్​ వద్ద రోడ్డు ప్రమాదం

ట్రాఫిక్​ నియమాలను ఉల్లంఘించడమే కాకుండా మద్యం మత్తులో బైక్​ని ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్ మాదాపూర్​ సైబర్​ టవర్​ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

మద్యం మత్తు : బైక్​ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి

author img

By

Published : Nov 13, 2020, 5:04 PM IST

ట్రాఫిక్​ నియమాలను ఉల్లంఘించి మద్యం మత్తులో కారును నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ మాదాపూర్​ హైటెక్ ​సిటీ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సిగ్నల్ జంప్​ చేసి..

సిగ్నల్​ జంప్​ చేసి కారుని నడుపుతున్న కాశీ విశ్వనాథ్​ అనే వ్యక్తి , బైక్​పై మాదాపూర్​ నుంచి కొండాపూర్​ వైపుకి వెళ్తున్న భార్యా భర్తలు గౌతమ్​దేవ్​(33), శ్వేతని ఢీ కొట్టాడు. ఘటనలో గౌతమ్​ దేవ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాల పాలైన శ్వేతని స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు.

మద్యం మత్తులోనే..

నిందితుడు మద్యం మత్తులో కారుని నడిపినట్లుగా పోలీసులు తెలిపారు. కారులో ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తు : బైక్​ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి

ఇదీ చదవండి: తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.