Renuka Chowdhury warns police : రాహుల్‌గాంధీని ఈడీ విచారించడానికి వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది. ముఖ్యంగా పోలీసులు మహిళా కాంగ్రెస్ నేతల అరెస్టుకు యత్నించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. తనను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. తనను చుట్టుముట్టిన పోలీసులతో గొడవ పడ్డారు.
పోలీసు కాలర్ పట్టుకుని లాగారు రేణుకా చౌదరి. 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్‌కు వచ్చి మరీ కొడతా' అంటూ పోలీసు అధికారిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. 'నాపై చేయి వేస్తే పార్లమెంట్ వరకు ఈడ్చుకెళ్తా' అని హెచ్చరించారు. అనంతరం రేణుకా చౌదరిని పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇవీ చదవండి :