ETV Bharat / city

e-KYC for ration: రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులందరికీ.. ఈ-కేవైసీ తప్పనిసరి! - ఏపీలో రేషన్ కార్డు వార్తలు

'ఇకపై రేషన్ బియ్యం కావాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. పెద్దలైతే నెలాఖరులోగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలి.. పిల్లలైతే వచ్చే నెలాఖరు వరకే అవకాశం. రేషన్ కార్డులో ఎంకమంది పేరు ఉన్నా.. కేవైసీ చేయించుకున్న వారికే బియ్యం అందుతాయి'- పౌరసరఫరాల శాఖ

ration rice
ration rice
author img

By

Published : Aug 18, 2021, 7:04 AM IST

రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులంతా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సిందే. లేదంటే రాబోయే రోజుల్లో వారికి రేషన్‌ బియ్యం, ఇతర నిత్యావసరాలు అందే వీలుండదు. ఒక రేషన్‌ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులుంటే.. ఎంతమంది ఈ కేవైసీ చేయించుకుంటే వారికే బియ్యం అందుతాయి. ఈ మేరకు పౌర సరఫరాలశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్‌ కార్డుల్లో 4 కోట్ల మందికి పైగా సభ్యులున్నారు.

వీరిలో 85 శాతం మంది వివరాలు ఈ-కేవైసీ విధానంలో నమోదయ్యాయి. ఇంకా 35 లక్షల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉంది. అందరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే కేంద్రం ఆదేశాలతో.. పౌర సరఫరాలశాఖ దీనిపై దృష్టి పెట్టింది. కార్డులో ఎవరికి ఈ-కేవైసీ కాలేదో.. వారికి రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. ఇందులో పేరున్న వారంతా నెలాఖరులోగా ఈ-కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

దీంతో ఆధార్‌ వేలిముద్రలు పడనివారు మీ-సేవా కేంద్రాలు, తపాలా కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. అనేక చోట్ల బారులు తీరుతున్నారు. కార్డుల్లో పేర్లున్న అయిదేళ్ల లోపు పిల్లలకూ కొత్తగా నమోదు చేయించి, ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి వస్తోంది. పెద్దలు ఆగస్టు నెలాఖరులోగా, పిల్లలకైతే సెప్టెంబరు నెలాఖరు లోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కావాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'క్రమంగా గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.