Ration kastalu: ప్రజల సౌకర్యార్థం ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ప్రస్తుతం ఈ పథకం అమలు కావటం లేదు. రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు మూలన పడ్డాయి. వాటి వల్ల ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.
వాహనాలు ఉన్న సాగని సరఫరా..
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలవ్యాప్తంగా 64 చౌక దుకాణాలు ఉన్నాయి. సరుకులు పంపిణీ చేయడానికి 13వాహనాలను ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనానికి నెలకు 21వేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.
అయితే అనేక గ్రామాల్లో రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలు ఇంటింటికీ రావట్లేదని వినియోగదారులు చెబుతున్నారు. రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఆ రోజు పనులకు వెళ్లకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. రేషన్ దుకాణాలు ఇళ్లకు దూరంగా ఉండటంతో వృద్ధులు ఇబ్బందులుపడాల్సి వస్తోందని చెబుతున్నారు.
స్పందించిన తహశీల్దార్..
ఈ విషయంపై ఉరవకొండ తహశీల్దార్ మునివేలు స్పందించారు. కార్డుదారులందరికీ ఇళ్ల వద్దకే సరుకులు అందేలా చర్యలు చేపడతామని మునివేలు భరోసా ఇచ్చారు. సరుకులు పంపిణీ చేసే వాహనదారులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఇదీ చదవండి:
Women Protest: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ రోడ్డుపై మహిళల బైఠాయింపు