ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా రథసప్తమి - Rathsaptami celebrations in temples news

రాష్ట్ర వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వార్లకు వాహన సేవలు జరిగాయి. సూర్యదేవుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివెళ్లారు.

Rathsaptami celebrations
వైభవంగా రథసప్తమి వేడుకలు
author img

By

Published : Feb 20, 2021, 10:38 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి మూల విరాట్​కు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారు ఉభయ దేవేరులతో కలసి నాలుగు వాహనాలలో మాడ వీధుల్లో విహరించారు. మొదట సూర్యప్రభ వాహన సేవతో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గో, హనుమ, గరుడ వాహనాలపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

కమణీయం కల్యాణం..

రథసప్తమి సందర్భంగా పెన్నహోబిలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఆలయ ఈఓ రమేశ్​ బాబు ధర్మకర్తల మండలి ఛైర్మన్ అశోక్ కుమార్, డీఎస్పీ షర్ఫుద్దీన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారితో ఉభయ దేవేరులకు మంగళ ధారణ కార్యక్రమం జరిపారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తుల గోవిందనామస్మరణల మధ్య శ్రీవారి కల్యాణం వైభవంగా జరిగింది. స్వామి వారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు బాలాజీ స్వామి, గుండు స్వామి, వైకాపా నేతలు పాల్గొన్నారు.

చిత్తూరులో...

రథసప్తమి వాహన సేవలను దర్శించుకునేందుకు తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో తిరుమాడవీధులు కిక్కిరిసి పోయాయి. కరోనా ప్రభావంతో ఏడాదిగా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు ఏకాంతంగా జరిగాయి. గత ఏడాది మార్చి నుంచి సందడి కోల్పోయిన తిరుమల కొండ... రథసప్తమి వేడుకకు వచ్చిన యాత్రికులతో సందడి వాతావరణం నెలకొంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహన సేవలపై దర్శనమిచ్చారు.

శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఆలయంలోని శ్రీ సూర్య భగవానుడుకి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగారు.

గుంటూరులో..

తెనాలిలోని వైకుంఠపురం క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై స్వామిని సేవించారు. ఈ సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులతో కలిసి ఆయన కూడా కాసేపు రథం లాగారు. స్వామివారి రథోత్సవంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. వైకుంఠపురం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఆలయానికి కోటిన్నర విలువచేసే ఇంటిని ఇచ్చిన గట్టినేని కృష్ణకుమారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

చిలకలూరిపేటలో రథసప్తమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. స్థానిక గీతా మందిరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఛాయా ఉషా దేవి సమేత సూర్యనారాయణస్వామికి ప్రత్యేక అలంకరణ చేసి.. పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య హోమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిర్వాహక కమిటీలు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశాయి.

కడపలో...

జిల్లాలోని పలు వైష్ణవాలయాలలో రథసప్తమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. బద్వేల్​, నరసాపురంలోని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.

కృష్ణా జిల్లాలో...

పెనుగంచిప్రోలు కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సూర్యారాధన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులంతా సూర్యునికి అభిముఖంగా నిలబడి నమస్కరిస్తూ ఆరాధన చేశారు. ఈ విధంగా చేయటం ఎంతో ఆరోగ్యదాయకం అనే విషయాన్ని విజ్ఞాన శాస్త్రం చెబుతోందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆళ్ల రాంబాబు పేర్కొన్నారు. రోజూ అరగంట సేపు ఎండలో నిల్చొని సూర్యారాధన చేయటం వల్ల అనారోగ్యాలు దరిచేరవని తెలిపారు.

నెల్లూరులో..

నగరంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఏడు వాహనాలపై స్వామివారు రంగనాయకులపేట పురవీధుల్లో విహరించారు. సూర్యప్రభ, గరుడ వాహనం, సింహవాహనం, హంస వాహన సేవ, బంగారు తిరుచ్చి, చంద్రప్రభ వాహనాలపై రంగనాథుని ఊరేగింపు నిర్వహించారు. సప్త వాహనాల్లో విహరించే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ప్రకాశం జిల్లాలో...

చీరాలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు. పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారికి బంగారు కిరీటం ధరింపచేశారు. ప్రత్యేక అలంకరణలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు.

విజయనగరం జిల్లాలో...

జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. చీపురుపల్లిలోని కామాక్షి అమ్మవారికి ధన, స్వర్ణాభరణాలతో అలంకరణ చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలింగాపురంలో మనసాదేవి ఆలయంలో అమ్మవారికి 121 లీటర్లతో పాలాభిషేకం చేశారు. పార్వతీపురం సూర్యపీఠం, గరివిడి సూర్య సదనంలో రథసప్తమి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. విజయనగరం రింగ్ రోడ్డు జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. బాబామెట్ట సూర్యభగవాన్ గుడిలో రథసప్తమి పూజలు అత్యంత వేడుకగా జరిగాయి. స్వామి వారి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. తితిదే హిందు ధర్మప్రచార పరిషత్​ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో తితిదే కల్యాణ మండపంలో సూర్యజయంతి నిర్వహించారు. ఉదయం 9గంటలకు విద్యార్థినీ విద్యార్థులతో సూర్యనమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం కార్యక్రమాలు జరిగాయి.

ఇదీ చదవండి:

సప్తవాహనాలపై శ్రీనివాసుడి అభయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.