ETV Bharat / city

కరోనా అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్​ యాంటీజెన్​ కిట్లు - rapid antijen tests in ap for corona patients news

రాష్ట్రంలో కరోనా అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక స్థాయిలో నిర్ధరణ కోసం మాత్రమే ర్యాపిడ్ కిట్లు వినియోగించాలని సూచించింది. కరోనా లక్షణాలు కలిగిన రోగుల చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేసేందుకు మాత్రం.... ట్రూనాట్ ఆర్టీపీసీఆర్​ పరీక్షలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.

కరోనా అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్​ యాంటీజెన్​ కిట్లు

author img

By

Published : Jul 14, 2020, 12:30 PM IST

కరోనా అనుమానితుల పరీక్షల కోసం ప్రాథమికంగా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ మేరకు జిల్లాకు 20 వేల చొప్పున కిట్లు సరఫరా చేసింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్‌గా తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి... సదరు రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్​వోలకు సూచించింది. కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే అలాంటి వారికి మరోమారు రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్​ చేయాలని స్పష్టం చేసింది.

హై రిస్కు కేసులు కలిగిన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించాలని తెలిపింది. 10 రోజుల క్వారంటైన్ అనంతరం డిశ్చార్జ్‌ అవుతున్నవారిని కూడా.... ఈ కిట్లతో పరీక్షించవచ్చని సూచించింది. కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులను డిశ్చార్జ్‌ చేసేందుకు...ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

క్షేత్రస్థాయిలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లతో పాటు ఏఎన్​ఎం స్థాయిలోనూ అనుమానితుల నుంచి స్వాబ్ తీసేందుకు వైద్యారోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. ఈ స్వాబ్ సేకరించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నా ఫలితాలు వెల్లడి కావటంలో 4 నుంచి 5 రోజులు పడుతుంటంతో... కరోనా చికిత్సపై తీవ్ర జాప్యం ఏర్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి..

కరోనాను తరిమికొట్టలేమా? సాధ్యమే.. మరి ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.